భార‌త్-యూఏఈ ట్రావెల్ బ్యాన్ పొడిగింపు

- April 29, 2021 , by Maagulf
భార‌త్-యూఏఈ ట్రావెల్ బ్యాన్ పొడిగింపు

యూఏఈ: భారత్ లో రికార్డ్ స్థాయిలో న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో భార‌త్ పై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది యూఏఈ. మ‌రో ప‌ది రోజుల పాటు అంటే..మే 14 వ‌ర‌కు భార‌త్ నుంచి విమానాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.అలాగే..ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే వారు కూడా ప్ర‌యాణానికి 14 రోజుల్లోపు భార‌త్ లో ప‌ర్య‌టించిన‌ట్లైతే వారికి కూడా ట్రావెల్ బ్యాన్ అంక్ష‌లు వ‌ర్తిస్తాయి. అయితే..రెండు దేశాల దౌత్య‌వేత్త‌లు, ఉన్న‌తాధికారులు, వ్యాపార‌వేత్త‌ల విమానాల‌కు ట్రావెల్ బ్యాన్ వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే గోల్డెన్ రెసిడెన్సీ హోల్డ‌ర్స్ కి కూడా ఆంక్ష‌లు వ‌ర్తించ‌వు.  అయితే..వీరంతా కోవిడ్ ప్రోటోకాల్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, యూఏఈకి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవ‌టంతో పాటు ప‌ది రోజులు క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించింది. దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నాలుగో రోజు, ఏనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల‌ని పేర్కొంది యూఏఈ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com