ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ కన్నుమూత..!
- April 30, 2021చెన్నై: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కెవి ఆనంద్(54) మృతి చెందారు.గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడిగా కంటే ముందు జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ గా ఆయన సేవలను అందించారు. తెన్మివాన్ కోంబత్ చిత్రానికి గాను 1994లో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక 2005లో ఆయన దర్శకుడిగా మారారు. అయాన్, కో, కావన్, కప్పాన్, లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో డబ్ అయిన రంగం, వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు ఈయన తీసినవే.!
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!