ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 30, 2021
అమరావతి: ఏపీ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్ మొదలైన తర్వాత క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో ఏపీలో 17,354 కొత్త పాజిటివ్ కేఉలు నమోదు కాగా.. 64 మంది మృతి చెందారు.దీంతో..రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,98,795కు చేరుకోగా.. ఇప్పటి వరకు 9,67,823 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 7,992 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ప్రస్తుతం 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
ఇక, ప్రైవేట్ ఆస్పత్రిలకు 15,294 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు అనిల్ కుమార్ సింఘాల్తెలిపారు.437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశామని.. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు.ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి.. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉందన్న ఆయన.. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం 7,749 మంది కోవిడ్ కేర్ సెంటర్లల్లో ఉన్నారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







