భారత్‌లో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా జరగవచ్చు: WHO
- May 01, 2021
జెనీవా: ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ కొనసాగుతోంది.రోజురోజుకు పాజిటివ్ కేసులు,మరణాలు తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి.కరోనా కట్టడికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాల పరిశోధకులు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా,మరో వైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక భారత్‌లో అయితే తీవ్ర స్థాయిలో కేసులు,మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురవుతోంది.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా దేశాలకు ఓ హెచ్చరిక చేసింది.
భారతదేశంలో పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తవచ్చని పేర్కొంది.కరోనా నియంత్రణ చర్యలను ఏమాత్రం తగ్గించినా భారత్‌లో తలెత్తుతున్న పరిస్థితులు ఇతర దేశాల్లోకి తలెత్తే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అయితే ఇటువంటి తప్పిదం ఏ దేశమూ చేయవద్దని ఐరోపా విభాగం అధిపతి హాన్స్ క్లూగె సూచించారు.ప్రస్తుతం కూడా ఐరోపాలో కరోనా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోందని, ఇలాంటి సమయంలో కరోనా నియంత్రణ చర్యలను ఏమాత్రం సడలించినా ప్రమాదమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







