ఇంటర్‌పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- June 15, 2026
యూఏఈ: అవినీతితో సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ చీఫ్ బెనజీర్ అహ్మద్ ను యూఏఈలో అరెస్ట్ అయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు సన్నిహిత మిత్రుడైన బెనజీర్, అక్రమంగా కోట్లాది డాలర్ల సంపదను దాచిపెట్టారన్న ఆరోపణలపై ప్రజాగ్రహం చెలరేగడంతో 2024 మేలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లారు.
రాపిడ్ యాక్షన్ బెటాలియన్ పారామిలిటరీ దళానికి నాయకత్వం వహించినప్పుడు, వందలాది మంది అదృశ్యం కావడం మరియు చట్టేతర హత్యలలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలపై 2021లో అమెరికా ఈ అధికారిపై ఆంక్షలు విధించింది. బెనజీర్ అహ్మద్‌ను యూఏఈలో జూన్ 12న అరెస్ట్ చేశారని, త్వరలో ఆయనను అప్పగిస్తారని బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ పార్లమెంటుకు తెలిపారు. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







