ఈటల అవుట్..కేసీఆర్ ఇన్.. వెనువెంటనే అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ
- May 01, 2021
ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖను చూశారు మంత్రి ఈటల రాజేందర్.. అయితే, ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. ఆ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు గవర్నర్ తమిళిసై.. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఈ శాఖ చాలా కీలకం.. నిరంతరం పర్యవేక్షించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి గనుక.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ విషయంలో గానీ, ఆక్సిజన్ మరియు బెడ్ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయొద్దని సీఎంకు స్పష్టం చేశారు.. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







