భారత్ కు ఆక్సిజన్ చేర్చేందుకు ఆపేరేషన్ 'సముద్ర సేతు'

- May 01, 2021 , by Maagulf
భారత్ కు ఆక్సిజన్ చేర్చేందుకు ఆపేరేషన్ \'సముద్ర సేతు\'

భారత్: కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అయిపోతున్న భారత్ పలు సవాళ్లు ఎదుర్కొంటోంది..ఆక్సిజన్ అందక, హాస్పిటళ్లలో పడకల జాగా లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ కష్టకాలంలో భారత్ కు అండగా ప్రపంచదేశాలు తమవంతు సాయం అందిస్తున్నాయి.

విమానమార్గాల ద్వారా ఆక్సిజన్ కంటైనర్లు మరియు వైద్య పరికరాల రవాణా జరుగుతున్న తరుణంలో నావికాదళం సైతం 'సముద్ర సేతు' ద్వారా ఈ రవాణా కార్యక్రమంలో పాల్గొంటోంది.

'సముద్ర సేతు II' ఆపరేషన్‌లో భాగంగా, వివిధ దేశాల నుండి ద్రవ వైద్య ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు మరియు అనుబంధ వైద్య పరికరాలను భారత్ కు చేర్చేందుకు నడుం బిగించిన 7 భారతీయ నావికాదళ ఓడలు - కోల్‌కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రికాండ్, జలశ్వా మరియు ఐరావత్.

బహ్రెయిన్ నుండి భారత్ కు 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (LMO) ను INS తల్వార్ రవాణా చేస్తుంది. అలాగే..ఖతార్ నుండి వైద్య సామాగ్రిని, కువైట్ నుండి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను INS కోల్‌కతా రవాణా చేస్తుంది. సింగపూర్ నుండి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను రవాణా చేసేందుకు INS ఐరవత్ సిద్ధంగా ఉండగా..INS జలష్వా, కొచ్చి, త్రికంద్ & టాబర్ నౌకలు తదుపరి ఆదేశాలకు అరేబియా సముద్రంలో సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన భారత నావికాదళం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com