ఏపీలో కరోనా కేసుల వివరాలు
- May 01, 2021
అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉండగా.. సెకవండ్ వేవ్‌లో అత్యధికంగా ఇవాళ ఏకంగా 19 వేల పైచీలుకు కేసులు నమోదు అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. గతో 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 61 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు చేరుకోగా.. మృతుల సంఖ్య 8 వేలు దాటింది.ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్..17,382 డోసుల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు.188 ఆస్పత్రులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఇండెంట్ పెట్టాయని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5,371 డోసులు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయని.. 551 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నారని.. 43,491 బెడ్లు ఉన్నాయి.. 32,301 బెడ్లు ఆక్యుపై అయ్యాయన్నారు.
తాజా వార్తలు
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









