పూర్తిస్థాయి కర్ఫ్యూ అవసరం లేదన్న సుప్రీం కమిటీ
- May 02, 2021
కువైట్ సిటీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయి కర్ఫ్యూ అవసరం లేదని కువైట్ సుప్రీం కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గినట్లు కమిటీ వెల్లడించింది. పాక్షిక కర్ఫ్యూ విధింపుతో కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య కొన్నాళ్లుగా స్థిరంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి పూర్తి కర్ఫ్యూ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..వైరస్ బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని, కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 65 శాతం ప్రవాసీయులేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని..అయినా, ముందస్తు జాగ్రత్తలతో కువైట్ దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించగలుగుతోందని సుప్రీం కమిటీ పేర్కొంద.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







