అల్ ఐన్ లో మరో డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభం
- May 02, 2021
అల్ ఐన్: వీలైనంత వేగంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఉన్న యూఏఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా..అబుధాబి ఆరోగ్య శాఖ మరో వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించింది. అల్ ఐన్ ప్రాంతంలోని అల్ సరౌజ్ లో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలాగే రాత్రి 8 గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు వ్యాక్సిన్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే..రమదాన్ మాసం సందర్భంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. రమదాన్ మాసం ముగిసిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టైమింగ్స్ మారుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అల్ ఐన్ లోని డ్రైవ్ త్రూ స్క్రీనింగ్ సెంటర్ను మూసివేస్తున్నట్లు ఆంబులేటరీ హెల్త్ కేర్ సర్వీస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







