మూడు గెటప్స్‌లో హీరో కళ్యాణ్ రామ్!
- May 02, 2021
హైదరాబాద్: మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్‌రామ్‌కి ఇది 19వ సినిమా. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఈ సినిమాతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమాకి 'ఎమిగోస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎమిగోస్' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మూడు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఇందులో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు నందమూరి హీరోలందరూ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఆ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







