600 ఆక్సిజన్ సిలిండర్లను భారత్ కు పంపిన ఐసీఎస్‌జీ
- May 02, 2021
కువైట్ సిటీ: భారత్ కు తమ వంతు సాయంగా కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ 600 ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. ఈ మేరకు ఆక్సిజన్ సిలిండర్లను కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఐసీఎస్‌జీ అందజేసింది. ఈ సిలిండర్లను భారత్ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు..వారం రోజుల్లో భారత్ కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అంచనాలకు మించి కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రికి పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే..అనూహ్య సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు రావటంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది సరైన చికిత్స అందక ఊపిరివదిలారు. ఈ హృదయవిదారక పరిస్థితులతో ప్రపంచదేశాలు చలించిపోయాయి. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







