ఈద్ ప్రార్థనల్ని రద్దు చేసిన ఒమన్ దేశం

- May 03, 2021 , by Maagulf
ఈద్ ప్రార్థనల్ని రద్దు చేసిన ఒమన్ దేశం

ఒమన్: ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఈద్ ప్రార్థనల్ని రద్దు చేసింది ఒమన్ ప్రభుత్వం. అలాగే ఎక్కువమంది గుమికూడటాన్ని కూడా నిషేధించింది. పార్కుల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు గుంపులుగా తిరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. పని ప్రాంతాల్లో ఉద్యోగుల అటెండెన్స్ కూడా రద్దు చేసింది ఒమన్. వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే పని చేయాలని ఉద్యోగులకు ఆదేశించింది. ఆదివారం మే 9 నుంచి ఈ నిబందనలు వర్తిస్తాయి. ప్రైవేటు సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కమిటీ విజ్నప్తి చేసింది. మే 8 నుంచి 15వ తేదీ వరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జన సంచారంపై నిషేధం విధించింది ఒమన్. ఫుడ్ స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్లు, ఫార్మసీలు మినహాయించి, మిగతా అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ మీదా పూర్తిస్థాయి బ్యాన్ విధించడం జరిగింది. డెలివరీ సర్వీసులకూ మినహాయింపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com