పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
- May 03, 2021
న్యూఢిల్లీ: భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర మరింత కీలకం. తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే. కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయం. పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







