కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది మృతి

కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది మృతి

మెక్సికో సిటీ: మెక్సికోలో మెట్రో ట్రైన్ వంతెన ప్ర‌మాద‌వ‌శాత్తు కూలిపోవ‌డంతో రైలు బోగీలు కింద‌ప‌డిపోయాయి.ఈ ప్ర‌మాదంలో 13 మంది మృతి చెందగా, మ‌రో 70 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.సోమ‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది.ఈ ప్ర‌మాదంలో మెట్రో రైలు వంతెన కింద ఉన్న ప‌లు వాహ‌నాలు కూడా దెబ్బ‌తిన్నాయి.మెక్సికో సిటీ మేయ‌ర్ క్లాడియా షీన్‌బౌం క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సివుంది. 

Back to Top