మాద‌క‌ద్ర‌వ్యాల స్మ‌గ్లింగ్ కుట్ర‌ను భ‌గ్నం చేసిన బోర్డ‌ర్స్ గార్డ్స్‌

మాద‌క‌ద్ర‌వ్యాల స్మ‌గ్లింగ్ కుట్ర‌ను భ‌గ్నం చేసిన బోర్డ‌ర్స్ గార్డ్స్‌

సౌదీ: సౌదీలోకి భారీ ఎత్తున మ‌త్తుప‌దార్ధాల‌ను స్మ‌గ్లింగ చేయాల‌న్న కుట్ర‌ను స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1000 కిలోల‌కు పైగా హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో జ‌జాన్ ప్రాంతంలో 515 కిలోల డ్ర‌గ్స్ తో పాటు 961 కిలోల మ‌త్తుప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 18 మంది ఇథియోపియన్ జాతీయులు, నలుగురు యెమెన్లు, ఇద్దరు సౌదీ పౌరులతో సహా మొత్తం 24 మందిని అదుపులోకి చేసుకున్నారు. ఇదిలాఉంటే..ఖ‌ట్ ప్రాంతంలో  44.7 టన్నుల డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్లతో సహా 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

Back to Top