కువైట్ నుంచి భార‌త్ చేరుకున్న ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, వెంటిలేట‌ర్లు

కువైట్ నుంచి భార‌త్ చేరుకున్న ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, వెంటిలేట‌ర్లు

కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భార‌త్ కు కువైట్ అందించిన వైద్య ప‌రిక‌రాల సాయం మంగ‌ళ‌వారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్, 60 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట్స్ , వెంటిలేట‌ర్లు ఇండియాకు అందాయి. ఈ మేర‌కు భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క్లిష్ట స‌మ‌యంలో భార‌త్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన కువైట్ కు ధ‌న్య‌వాదాలు వ్య‌క్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మ‌రింత బ‌ల‌ప‌డేలా ప‌రస్ప‌ర స‌హ‌కారం భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగాల‌ని ఆకాంక్షించింది. 

 

Back to Top