వైద్య‌శాఖ‌లో రాజీనామాల‌పై నిషేధం విధించిన ఒమ‌న్

- May 05, 2021 , by Maagulf
వైద్య‌శాఖ‌లో రాజీనామాల‌పై నిషేధం విధించిన ఒమ‌న్

 ఒమ‌న్: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఒమ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శాఖ‌లో సిబ్బంది రాజీనామాల‌ను నిషేధిస్తు ఉత్త‌ర్వ్యులు జారీ చేసింది. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు వైద్య సాయం అత్య‌వ‌స‌రం అని అభిప్రాయ‌ప‌డింది. ఈ స‌మ‌యంలో వైద్య శాఖ సిబ్బంది త‌మ విధుల నుంచి త‌ప్పించుకునేందుకు రాజీనామా నిర్ణ‌యాలు తీసుకుంటే అందుకు తాము అంగీక‌రించేందుకు సిద్ధంగా లేమ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలాఉంటే ఒమ‌న్ మాన‌వ హ‌క్కుల సంఘం కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com