కోవిడ్ రూల్ బ్రేక్ చేసిన 384 మందిపై చ‌ర్య‌లు

- May 05, 2021 , by Maagulf
కోవిడ్ రూల్ బ్రేక్ చేసిన 384 మందిపై చ‌ర్య‌లు

దోహా: కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన  వారిని ఉపేక్షించేది లేద‌ని ఖ‌తార్ అధికారులు మ‌రోసారి హెచ్చ‌రించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కపోవ‌టం అంటే చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు ప‌ల్ప‌డుతున్న‌ట్లేన‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసిన ఖ‌తార్ అధికారులు...తాజాగా మ‌రో 384 మందిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో 330 మంది ఫేస్ మాస్క్ ధ‌రించ‌లేద‌ని, మ‌రో 40 మంది భౌతిక దూరం పాటించ‌లేద‌ని వెల్ల‌డించింది. క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 8 మందితో పాటు హెతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఆరుగురిపై కూడా కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com