వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్ర‌యాణం సుల‌భ‌త‌రం

- May 05, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్ర‌యాణం సుల‌భ‌త‌రం

యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్ర‌యాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజ‌ర్ ను సుల‌భ‌త‌రం చేయ‌బోతోంది యూఏఈ. ఈ మేర‌కు యూఏఈ విప‌త్తుల నిర్వ‌హ‌ణ అధికార విభాగంలోని ఉన్న‌తాధికారుల నుంచి స‌మ‌చారం అందుతోంది.ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లులో ఉన్న ప్ర‌యాణ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించ‌బోతున్నామ‌ని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధ‌న‌ల‌తో ప్ర‌యాణాల‌ను సుల‌భ‌త‌రం చేసేలా చర్య‌లు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే..ప్ర‌యాణికులు ఏయే దేశాల నుంచి వ‌స్తున్నార‌నే అంశాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గ‌నిర్దేశ‌కాలపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com