ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు వాయిదా
- May 06, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే.అయితే కరోనా వ్యాప్తికి ఈ ఎన్నికలే కారణమని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, ఇటీవలే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తిరుపతిలో వైసీీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ నేత నోముల భగత్ విజయం సాధించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







