కమెడియన్ పాండు కన్నుమూత.. !
- May 06, 2021
చెన్నై: కరోనా... కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది, ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు, పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్యకి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. పాండు మృతి పట్ల చిత్రపరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా 1970 లో మానవన్ చిత్రంతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆయన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







