రమదాన్: 1000కి పైగా వాహనాల సీజ్

- May 06, 2021 , by Maagulf
రమదాన్: 1000కి పైగా వాహనాల సీజ్

దోహా: రమదాన్ నేపథ్యంలో చేపట్టిన తనిఖీల సందర్భంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకూ 1000కి పైగా వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో సీజ్ చేయడం జరిగింది. సంబంధిత శాఖలకు సీజ్ చేసిన వాహనాల్ని తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ మొహమ్మద్ సఫర్ అల్ కువారి మాట్లాడుతూ, రమదాన్ తొలి రోజు నుంచి ఈ తనిఖీలు ప్రారంభించామనీ, రమదాన్ పూర్తయ్యేదాకా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. సివిలియన్ అలాగే మిలిటరీ పెట్రోల్స్ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు చోటు చేసుకుంటాయన్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com