34 మందితో తమిళనాడు క్యాబినెట్... గవర్నర్ ఆమోదం
- May 06, 2021
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. భావి సీఎం స్టాలిన్ సిఫారసులకు రాజముద్ర వేశారు.కాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్టాలిన్ గవర్నర్ కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదు. ఇక, స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన వద్ద ఉంచుకుంటున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









