అబుదాబీలో వారం రోజుల్లో 5067 కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

- May 08, 2021 , by Maagulf
అబుదాబీలో వారం రోజుల్లో 5067 కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి గడచిన వారం రోజుల్లో అబుదాబీలో 5067 ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగింది. 4,210 జరీమానాలు జారీ చేశారు. వీటిల్లో 72 ఎక్కువమంది గుమికూడటానికి సంబంధించిన ఉల్లంఘనలు. 786 హెచ్చరికలు కమర్షియల్ మరియు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో జారీ అయ్యాయి. 14 రోజులపాటు తాత్కాలికంగా 71 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టైలర్లు, గ్యారేజీలు, యాక్సెసరీ షాపులు, బార్బర్ షాపులు, రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు వీటిల్లో వున్నాయి. ఉల్లంఘనల్ని టోల్ ఫ్రీ నెంబర్ 800 2626 ద్వారా తెలియజేయవచ్చు. 2828 అనే నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ కూడా చేసి ఫిర్యాదు చేయవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com