ఏపీ కరోనా అప్డేట్

ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ 20 వేలు దాటిపోయాయి.తాజాగా ఏపీలో 20,065 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,10.571 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు.రాష్ట్రంలో మొత్తం 19.75 శాతం పాజిటివిటి రేటు ఉన్నట్టు అశోక్ సింఘాల్ తెలిపారు. విశాఖలో అత్యధికంగా 2,525 కేసులు నమోదుకాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు నమోదయ్యాయి.  మూడు జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మరణించగా, విశాఖలో 12 మంది మృతి చెందారు. 

Back to Top