100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్

100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్

దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ప్రజలు 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతం చేయడం పట్ల ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపు నేపథ్యంలో 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 385,000 మంది ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. 30 దేశాలకు ఈ ఆహార పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది.‘ఇదీ యూఏఈ అంటే..’ అంటూ దుబాయ్ రూలర్ పేర్కొన్నారు.

Back to Top