ఉత్తమ దర్శకుడిగా రామ్ అల్లాడికి 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్' అవార్డు
- May 09, 2021
హైదరాబాద్: న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్‌మేకర్, ప్రవాసాంధ్రుడు రామ్ అల్లాడిని మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ''రా'స్ మెటనోయా"కిగాను ఉత్తమ దర్శకుడు విభాగంలో ఆయన విజేతగా నిలిచారు.
"చేసిల్డ్" డాక్యుమెంటరీతో దర్శకుడిగా మారిన రామ్ అల్లాడి, తొలి ప్రయత్నంలో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా ఆయన తీసిన రెండో చిత్రం "రా'స్ మెటనోయా" నవంబర్ 2020లో విడుదలైంది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితంపై ప్రేమతో రామ్ అల్లాడి తీసిన ఈ చిత్రానికి ఇప్పటికే పన్నెండుకుపైగా అవార్డులు వచ్చాయి. యూరోపియన్, న్యూయార్క్ సినిమాటోగ్రఫీ అవార్డులు, లండన్స్ గోల్డ్ మూవీ అవార్డులు వాటిలో ఉన్నాయి. వెనిస్ షార్ట్స్, ది ఆమ్స్టర్డ్మ్ వరల్డ్ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో "రా'స్ మెటనోయా" బెస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్‌గా అవార్డులు అందుకుంది. న్యూయార్క్ నగరంలో ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్-ప్లే, కల్ట్ క్రిటిక్ మూవీ అవార్డ్స్‌లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు... వర్జిన్ స్ప్రింగ్ సినీఫెస్ట్లో ఎడిటింగ్,
స్కోర్ (నేపథ్య సంగీతం), ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 'రీల్ హార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ స్క్రీన్ ప్లే' 17వ వార్షిక చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ఎంపికైంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్' లో రామ్ అల్లాడిని వరించింది.
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఏప్రిల్ 30న 'దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహించారు. మన భారతదేశంతో పాటుప్రపంచవ్యాప్తంగా సుమారు 110 దేశాలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ తీసిన సినిమాలు అవార్డుల కోసం వివిధ విభాగాల్లో పోటీ పడ్డాయి. ఈ పోటీలో "రా'స్ మెటనోయా"కు గానుఉత్తమ దర్శకుడిగా రామ్ అల్లాడికి అవార్డు లభించింది. ఈ అవార్డు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సంస్కృత సినిమా 'నభాంసి'కి రామ్ అల్లాడి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా మార్చిలో చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచిసంస్కృత సినిమాతీస్తున్న తొలి దర్శకుడు ఆయనే కావడం గమనార్హం.వచ్చే ఏడాది ఈసినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







