మధుర గాయకులు జి.ఆనంద్ కు అంతర్జాలంలో ఘననివాళి
- May 10, 2021
హ్యూస్టన్ / టెక్సాస్: ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి పలువురు ప్రముఖులు, కరోనా తో పరమపదించిన మధురగాయకులు జి ఆనంద్ కి అంతర్జాలంలో బాధాతప్త హృదయంతో నివాళు లర్పించారు.
ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి,"స్వరమాధురి’ "సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 కుపైగా కచేరీలు నిర్వహించారు.ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారు.

ఆనంద్ కరోనా సమయంలో సరియైనటు వంటి వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారుల జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదని కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం ప్రభుత్వాలు పరిశీలించాలని ఆనంద్ కు నివాళులర్పిస్తూ అన్నారు.ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా ,సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా,శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలో హ్యూస్టన్ నగరం నుండి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు.న్యూ జెర్సీ నుండి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు. అమెరికా కు చెందిన ఉపేంద్ర చివుకుల అమెరికాలో ఆనంద్ గానాన్ని చాలా సార్లు విన్నానని వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం తమనెంతో కలచి వేసిందని అన్నారు.ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్,ఘంటసాల రత్నకుమార్,భువన చంద్ర , మాధవ పెద్ది సురేష్, RP పట్నాయక్, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు , డా.నగేష్ చెన్నుపాటి,ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర,డా.ఆళ్ల శ్రీనివాస్,శారద సింగిరెడ్డి, దాము గేదెల,రవి కొండబోలు,శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు,తాతాజీ ఉసిరికల, అనిల్, హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము,ప్రవీణ్ కుమార్ కొప్పుల,వేణు శ్రీరంగం,సురేఖ మూర్తి దివాకర్ల, G.V ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ తో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమాన్ని సంతోషం ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెల్ మరియు సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లైవ్ ప్రసారం చేశాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







