తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
- May 11, 2021
ఏపీ: తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కోవిడ్ వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు మృతి చెందారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు.మరి కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని.. వైద్యులు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఐదు నిమిషాలు ఆలస్యం అవడంతో ఈ ఘటన జరిగినట్లు కలెక్టర్ తెలిపారు.
అయితే సమయానికి ఆక్సిజన్ రావడంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగామని కలెక్టర్ వెల్లడించారు.ఘటనా సమయంలో వార్డులో 140 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఆక్సిజన్ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు.ఆస్పత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టడంతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు.రోగుల బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాదకరంగా మారింది.ఇక రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







