అవినీతి: 11 మినిస్ట్రీస్ ఉద్యోగులు సహా 138 అరెస్ట్

- May 11, 2021 , by Maagulf
అవినీతి: 11 మినిస్ట్రీస్ ఉద్యోగులు సహా 138 అరెస్ట్

రియాద్: సౌదీ అరేబియా యాంటీ గ్రాఫ్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 138 మంది వ్యక్తుల్ని అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది. వీరిలో పౌరులు, వలసదారులు వున్నారు. ఓవర్ సైట్ మరియు యాంటీ కర్ప్షన్ అథారిటీ (నజాహా) ఈ విషయమై స్పందిస్తూ, అరెస్టయినవారిలో డిఫన్స్, ఇంటీరియర్, నేషనల్ గార్డ్, హెల్త్, జస్టిస్, మునిసిపల్ మరియు రూరల్ ెఫైర్స్ మరియు హౌసింగ్, ఎడ్యుకేషన్, రవాణా, మీడియా, స్పోర్ట్ మరియు హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ డెవలప్మెంట్ అలాగే జకాత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ.. ఇలా వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా అరెస్టయినవారిలో వున్నారు. 1733 తనిఖీల ద్వారా నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. www.nazaha.gov.sa లేదా ఇ-మెయిల్ [email protected] లేదా ఫ్యాక్స్ నెంబర్ 0114420057కి ఫ్యాక్స్ చేసి అనుమానిత కార్యకలాపాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com