ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత...
- May 11, 2021
గాజా సిటీ: మళ్లీ ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మద్య ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.పాలస్తీనాలోని గాజాపట్టీ ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడులు చేశారు.పదుల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చాయి.ఈ దాడిలో ఇజ్రాయిల్‌లోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.దీనికి ప్రతీకగా ఇజ్రాయిల్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.ఈ దాడిలో 24 మంది వరకు మరణించి ఉంటారని ఇజ్రాయిల్ తెలియజేసింది.దీంతో రెండు దేశాల మద్య యుద్దవాతావరణం నెలకొన్నది.1967లో ఇజ్రాయిల్‌లోని తూర్పు జెరూసలెం, పవిత్ర స్థలాలను ఇజ్రాయిల్ స్వాదీనం చేసుకుంది.దీనికి గుర్తుగా సొమవారం రోజున జెరూసలెం రోజును జరుపుకుంటారు.అయితే,ఆ రోజున దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన ఇజ్రాయిల్ జెరూసలెంలోని అల్ అక్సా మసీద్ వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.ఈ బలగాలకు, ప్రార్ధనలు చేయడానికి వచ్చిన వారికి మద్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు.దీనికి ప్రతీకగా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారని ఇజ్రాయిల్ బలగాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









