ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్

- May 12, 2021 , by Maagulf
ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..రవీంద్రభారతి,అబిడ్స్,నాంపల్లి,ఎం.జె మార్కెట్,మధీన,చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసాము.అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తాము అని తెలిపారు.జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.కోవిడ్ నిబంధనలు పాటించాలి.అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు సీపీ అంజనీకుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com