ప్రత్యేక దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం
- May 12, 2021
తిరుమల: కరోనా భయంతో భక్తులు తిరుమల వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వేళ టీటీడీ వెసులుబాటు కల్పించింది.రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది.మే 31 వరకు టికెట్లు పొందిన వారు తేదీ మార్చుకోవచ్చని, ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించింది.లాక్ డౌన్, కర్ఫ్యూతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది.రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది.కాగా మంగళవారం 2,262 మంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 925 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







