యూఏఈ: 12-15 ఏళ్ల పిల్లల కోసం.. ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం
- May 14, 2021
యూఏఈ: యూఏఈ లో 12-15 ఏళ్ల పిల్లలకూ ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ.. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను 12-15 ఏళ్ల పిల్లల కోసం అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ వ్యాక్సిన్ ప్రణాళిక సంఘం సూచనతో పాటు ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ చూపిన ప్రభావం, సామర్థ్యం ఆధారంగా వినియోగానికి అంగీకరించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం మహమ్మారి నుంచి 12-15 ఏళ్ల పిల్లలను రక్షించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.ఇక ఇటీవల కరోనాపై పోరులో భాగంగా అబుధాబి ఆరోగ్యశాఖ, అబుధాబి పబ్లిక్ హెల్త్ సెంటర్(ADPHC), దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) సంయుక్తంగా దేశవ్యాప్తంగా నివాసితులు, దేశ పౌరుల కోసం ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







