కోవిడ్ రూల్స్ బ్రేక్..మూడు మసీదుల మూసివేత

- May 15, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్..మూడు మసీదుల మూసివేత

బహ్రెయిన్: బహ్రెయిన్ రాజధాని గవర్నరేట్ పరిధిలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించటంతో మూడు మసీదులను తాత్కాలికంగా మూసివేశారు. ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల సందర్భంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కోవిడ్ నిరోధక జాతీయ టాస్క్‌ఫోర్స్ సమన్వయంతో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మసీదులను రెండు వారాల పాటు మూసివేయాలని నిర్ణయించింది. పూర్తిగా శానిటైజ్ చేసి రెండు వారాల తర్వాత యథావిధిగా భక్తులను అనుమతిస్తారు. మరోవైపు మహమ్మారి నుంచి తమతో పాటు తోటి వారిని రక్షించుకునేందుకు ప్రజలంతా బాధ్యతగా మసలుకోవాలని, మతపరమైన అంశాల్లోనూ ఆరోగ్య సూత్రాలను మరిచిపోవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com