తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం..
- May 15, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తోన్న తరుణంలో.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.దేశ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు కేసులు వెలుగుచూశాయి.. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఓ కేసు బయటపడింది.అయితే, బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కీలక సూచనలు చేశారు తెలంగాణ డీఎంఈ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్… ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్ ఫంగస్ సమస్య వస్తుందని తెలిపారు డీఎంఈ.. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్నవారిలో ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు ఎదుర్కొంటున్నారని.. దీంతో.. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు సర్కార్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. బ్లాక్ ఫంగస్ భారిన పడి, కోవిడ్ పాజిటివ్ గా ఉన్న వారికి గాంధీతో చికిత్స అందించనున్నారు.
కోవిడ్ బారినపడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించినట్టు ప్రకటించారు డీహెచ్ శ్రీనివాస రావు కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ ని సరిగా అదుపు చేయాలని ఆస్పత్రులు, వైద్యులకు కీలక సూచనలు చేసిన ఆయన…కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసేందుకే అవసరం అయితే స్టిరాయిడ్లను వాడాలని సూచించారు.అవసరం అయితే యాంటి ఫంగల్, యాంటీ బయోటిక్ మందులు వాడాలని ఆదేశాలిచ్చారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







