గాలి ద్వారా కరోనా వ్యాప్తి - పరిశోధకుల వెల్లడి…

గాలి ద్వారా కరోనా వ్యాప్తి - పరిశోధకుల వెల్లడి…

కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నది.  గత కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి.  దీనిపై పరిశోధకులు లోతైన పరిశోధనలు చేశారు.  ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.  గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే అని పరిశోధకులు చెప్తున్నారు.  ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కూడా ధృవీకరించింది. కరోనాతో ఇళ్లల్లోనే ఉండే వ్యక్తులు ఇంటి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలని, కిటికీలు, తలుపులు తీసి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.   

Back to Top