ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్ 80 వ జన్మదినోత్సవం

- May 18, 2021 , by Maagulf
ప్రముఖ  సినీ నటులు చంద్రమోహన్ 80 వ జన్మదినోత్సవం

వంశీ గ్లోబల్ అవార్డ్స్, సంతోషం ఫిలిం న్యూస్ మరియు అమెరికా గానకోకిల శారద ఆకునూరి సంయుక్త ఆధ్వర్యంలో మే 22, 23  తేదీలలో అంతర్జాలంలో ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్ 80  వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 
చంద్రమోహన్ నటనా వైదుష్యాన్ని ఐదు ఖండాల నుండి 14 దేశాల (ఇండియా, అమెరికా, కెనడా,యుకె,సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా,యుగాండా, సింగపూర్, మలేషియా,హాంగ్ కాంగ్, ఒమాన్, ఖతార్,అబుదాబి, న్యూజీలాండ్  )నుంచి రచయితలు ఆయన నటించిన 108  చిత్రాల పైన పది నిముషాల పాటు ప్రసంగించనున్నారు.వంశీ రామరాజు, సురేష్ కొండేటి,శారద ఆకునూరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 22  వ తేదీ ఉదయం ప్రముఖ చలన చిత్ర దర్శకులు రేలంగి నరసింహారావు ప్రారంభించనున్నారు. 23వ తేదీ రెండు గంటలకు ప్రారంభమయ్యే అంతర్జాల సభను మండలి బుద్ధప్రసాద్  ప్రారంభించనున్నారు.స్వర్ణయుగ నటీమణి జమునా రమణరావు, కళాతపస్వి కే. విశ్వనాథ్ ఆశీస్సులు అందించనున్నారు.అంతే కాకుండా ప్రముఖ చలన చిత్ర నటులు నిర్మాత మాజీ పార్లమెంటు సభ్యులు ఎం మురళీమోహన్, సినీ గేయ రచయిత భువన చంద్ర, చంద్రమోహన్ సతీమణి ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్, అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల తదితరులు పాల్గొంటారు.ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదు కాబోతున్నదని వెంకటాచారి తెలియజేసారు. రెండు రోజులపాటు 20 గంటల పాటు జరిగే చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని అమెరికా నుండి శారద ఆకునూరి, రాధికా నోరి,హాంగ్ కాంగ్ నుండి జయ పీసపాటి ,హైదరాబాద్ నుండి శిరోమణి వంశీ రామరాజు నిర్వహించనున్నారు.

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను పేర్కొంటారు.. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com