సినీ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం
- May 18, 2021
హైదరాబాద్: నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావల శ్యామల సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి 2లక్షలు రూపాయలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 లక్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో శ్యామల తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. మనస్ఫూర్తిగా చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







