రెస్టారెంట్లు, కేఫ్ లలో డైనింగ్ కు అనుమతి

- May 19, 2021 , by Maagulf
రెస్టారెంట్లు, కేఫ్ లలో డైనింగ్ కు అనుమతి

కువైట్ సిటీ: కరోనా ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తోంది కువైట్ ప్రభుత్వం. రెస్టారెంట్లు, కేఫ్ లలో సర్వీంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి ఇండోర్ డైనింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వీస్ అందించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించేలా హోటల్ పూర్తి సామర్ధ్యంలో కొంత మేరకే వినియోగదారులను అనుమతించాల్సి ఉంటుంది. అలాగే టేబుల్ టేబుల్ కి మధ్య డిస్టెన్స్ మెయిన్టేన్ చేయాలి. ఒక్కో టేబుల్ కు పరిమిత సంఖ్యలో కూర్చుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే..పూర్తి సామర్ధ్యంలో ఎంత శాతం మందిని అనుమతి ఇవ్వాలి, టేబుల్ డిస్టెన్స్, ఒక్కో టేబుల్ కు ఎంత మంది కూర్చునేందుకు అనుమతించాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రతి వినియోగదారుడి టెంపరేచర్ ను చెక్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని కూడా మంత్రివర్గం సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com