సినోఫార్మ్ బూస్టర్ షాట్ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

- May 19, 2021 , by Maagulf
సినోఫార్మ్ బూస్టర్ షాట్ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

బహ్రెయిన్: కోవిడ్ నుంచి దేశ ప్రజలకు పూర్తి ఆరోగ్య భద్రతను కల్పించటంలో భాగంగా బహ్రెయిన్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. సినోఫార్మ్ ఫార్మ్ బూస్టర్ షాట్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మూడో వ్యాక్సిన్ కింద ఈ సినోఫార్మ్ బూస్టర్ షాట్ ను ఇస్తారు. అయితే..అందరికీ కాకుండా ప్రధాన్యత వర్గాల ప్రకారం బూస్టర్ షాట్ ఇచ్చేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. సినోఫార్మ్ బూస్టర్ షాట్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకొని 6 నెలలు పూర్తి అయి ఉండాలి. 60 ఏళ్లు, అంతకుమించిన వయసు పైబడిన వారై ఉండాలి. అలాగే వైద్య రంగంలోని సిబ్బంది, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అనారోగ్య కారణాలతో ఊబకాయంతో బాధపడుతున్నవారు, కోమోర్బిడిటీస్ వారు సినోఫార్మ్ బూస్టర్ షాట్ కోసం బీఅవేర్ యాప్ ద్వారా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు..లబ్ధిదారులు పైన పేర్కొన్న గ్రూపులలో తాము ఏ వర్గానికి చెందినవారో ధృవపరిచేలా వ్యాక్సిన్ సమయంలో తగిన అధారాలు చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సెంటర్లో ఫిజిషియన్ చేత ఆధారాలను సరైనవేనని ధృవీకరించిన తర్వాతే బూస్టర్ షాట్ ఇస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com