రెసిడెంట్స్ కు సినోఫార్మ్ బూస్టర్ షాట్...యూఏఈ అనుమతి

- May 19, 2021 , by Maagulf
రెసిడెంట్స్ కు సినోఫార్మ్ బూస్టర్ షాట్...యూఏఈ అనుమతి

యూఏఈ: రెసిడెంట్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్ సినోఫార్మ్ ఇచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరింత ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో సినోఫార్మ్ బూస్టర్ షాట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలుపూర్తైన వారికి మాత్రమే సినోఫార్మ్ తీసుకునేందుకు అర్హులు. ఇదిలాఉంటే..దేశవ్యాప్తంగా ఇప్పటికే 73.88 శాతం అర్హులైన ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు యూఏఈ అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com