కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తులకు, రెస్టారెంట్లకు ఫైన్
- May 20, 2021
బహ్రెయిన్: కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘించిన వ్యక్తులకు, 10 రెస్టారెంట్ యాజమాన్యాలకు BD1000 నుంచి BD2000 వరకు జరిమానా విధిస్తూ బహ్రెయిన్ లోయర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈద్ అల్ ఫితర్ సెలవు రోజుల సమయంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు విచారణలో నిర్ధారించి..అందరికి కలిపి మొత్తం BD34,000 వరకు ఫైన్ విధించింది. బీఅవేర్ బహ్రెయిన్ యాప్ ద్వారా వినియోగదారులు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో నిర్దారించకుండానే రెస్టారెంట్ నిర్వాహకులు కస్టమర్లను లోనికి అనుమతించారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నివేదిక ద్వారా వెల్లడించారు. అంతేకాదు...రెస్టారెంట్ లోని వినియోగదారులను అనుమతించే ముందు ఖచ్చితంగా వారి టెంపరేచర్ చెక్ చేయాల్సి ఉన్నా...అవేం చేయకుండానే వినియోగదారులను అనుమతించారని, దీంతో రెస్టారెంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







