దుబాయ్ ఎయిర్ పోర్టులో రాపిడ్ పీసీఆర్ టెస్ట్..3-4 గంటల్లోనే రిపోర్ట్

- May 20, 2021 , by Maagulf
దుబాయ్ ఎయిర్ పోర్టులో రాపిడ్ పీసీఆర్ టెస్ట్..3-4 గంటల్లోనే రిపోర్ట్

దుబాయ్: ప్రయాణికుల కోసం దుబాయ్ విమానాశ్రయం రాపిడ్ పీసీఆర్ లాబరేటరీని సిద్ధం చేసింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ఈ రాపిడ్ పీసీఆర్ టెస్ట్ ద్వారా కేవలం 3-4 గంటల్లోనే రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీంతో దుబాయ్ కి వచ్చే ప్రయాణికులు పీసీఆర్ టెస్ట్ నిర్వహించుకొని కొద్ది గంటల్లోనే రిపోర్ట్ తీసుకొని వెళ్లిపోవచ్చు. లాబరేటరీ ఏర్పాటుకు సంబంధించి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో మాట్లాడుతూ..ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ కొత్త లాబరేటరీ తోడ్పడుతుందని అన్నారు. ఇదిలాఉంటే..బయోమెట్రిక్ వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని ప్రపంచ దేశాలు అమలులోకి తీసుకొస్తే..అది కాలక్రమేనా పీసీఆర్ టెస్టుకు మంచి ప్రత్యామ్నాయ విధానం కాగలదని అభిప్రాయపడ్డారు. డిజిటల్ టీకా పాస్‌పోర్ట్‌లతో ప్రయాణికుల గోప్యతకు నష్టం జరగబోదని ధీమా వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com