హైదరాబాద్ వాహనదారులకి ముఖ్య గమనిక ..
- March 05, 2016
గ్రేటర్ హైదరాబాద్ లో వాహన్ ప్రమాదాలను అరికట్టడానికి రవాణా శాఖ కొన్ని ముఖ్యమైన నిబంధనలను ఈ నెల 1 నుండి అమలులోకి తెచ్చింది. వీటిపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్ లలో ప్రకటన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రకటనల్లో ముఖ్యమైన సూచనలు ఇవే.
1. వాహనాలను రెడ్ లైట్ పడగానే ఆపాలి. 2. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. లేకపోతే జరిమానా, ఒకరోజు జైలు శిక్ష. 3. ఫోర్ వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 4. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష ఖాయం. 5. లైసెన్సులు, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. 6. వాహనదారులు తమ పత్రాలను ఉన్నత పోలీసు అధికారుల సమక్షంలోనే తనిఖీ చేయించుకోవాలి.
7. మితిమీరిన వేగానికి జరిమానా తప్పదు. 8. ఇకపై రవాణా శాఖ విధించే ఎటువంటి జరిమానానైనా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, పోస్టాఫీసుల్లో చెల్లించవచ్చు. 9. అనధికారిక పార్కింగ్ కు జరిమాన.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







