అన్నయ్య పాటకు స్టెప్పులేయనున్న పవర్ స్టార్,..
- March 05, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వస్తోంది. ఇప్పటికే శరవేగంగా, చివరి దశకు షూటింగ్ ను తీసుకొచ్చిన పవర్ స్టార్, ఇప్పుడు తన అన్నయ్య పాటకు స్టెప్పులేయ్యనున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో సర్దార్ సెట్ నుంచి, ఐటం సాంగ్ కు డాన్స్ చేస్తున్న రాయ్ లక్ష్మి, పవన్ ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే. ఆ ఐటెం సాంగే చిరు పాత పాటకు రీమిక్స్ అని అంటున్నారు. ఈ సాంగ్ లో రాయ్ లక్ష్మితో కలిసి పవన్ అలరించబోతున్నాడట. ఇంతకూ ఏ పాట అనేదేగా మీ డౌట్. కొండవీటి రాజా సినిమాలోని నా కోక బాగుందా పాటనే, ఇప్పుడు సర్దార్ లో రీమిక్స్ చేయబోతున్నారట. అప్పటి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ రీమిక్స్ చేస్తున్నాడు. ఒక వేళ ఈ వార్తలు నిజమైతే, మెగాఫ్యాన్స్ కు పండగే. ఇప్పటి వరకూ తన సినిమాల్లో, అన్నయ్య పాటలేవీ వాడుకోని తమ్ముడు ఈసారి వాడుతున్నాడో లేదో తెలియాలంటే, కొంత కాలం ఆగాల్సిందే మరి..
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







