కోవిడ్ చికిత్సకు ఆర్.యం.పీ,పి.యం.పీ లకు అనుమతి లేదు:కలెక్టర్ ఇంతియాజ్

- May 21, 2021 , by Maagulf
కోవిడ్ చికిత్సకు ఆర్.యం.పీ,పి.యం.పీ లకు అనుమతి లేదు:కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ: జిల్లాలో ఆర్.యం.పీ,పి.యం.పీ లు కోవిడ్ వైద్యానికి పాల్పడితే  భారత శిక్షస్పృతి కోడ్ 1860 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఒక ప్రకటన లో తెలిపారు.

ఆర్.యం.పీ,పి.యం.పీ లకు కోవిడ్ చికిత్సకు ఎపిడిమిక్ డీసీజస్ యాక్ట్ 1897,యాక్ట్ నెం.3 అఫ్ 1897 ప్రకారం అనుమతి లేదని స్పష్టం చేశారు.కోవిడ్ సంబంధింత లక్షణాలు బ్రాంకీయల్ అస్మా,ఎల్ విఎఫ్,ఏఆర్ డి,శారి,ఎక్యూట్ మమో కార్డియల్ ఇన్ఫెక్షన్, ఇతర అటువంటి చిహ్నాలు ఉన్న యెడల గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రిలో,గుర్తింపు పొందిన ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స అందించాలన్నారు.

కావున పైన పేర్కొన్న కేసులకు ఆర్.యం.పీ,పి.యం.పీలు వైద్యం చేయకుండా గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రులకు, కోవిడ్ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాలన్నారు. అలా కాకుండా కోవిడ్ చికిత్సకు పాల్పడితే భాద్యులపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com