ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
- May 22, 2021
హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బి.ఏ. రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శుక్రవారం రాత్రి తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సినిమా జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్నారు. పలువురు అగ్ర కథానాయకులకు వ్యక్తిగత పీఆర్వోగా వ్యవహరించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితమే ఆయన భార్య, దర్శకురాలు బీఏ జయ కన్నుమూశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







