కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- May 22, 2021
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై జాతీయ& పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పరిమితులు విధించింది. పౌరులు, జీసీసీ పౌరులతో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఆదివారం(మే 23) నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్పీఆర్ఏ పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాలి.అదీ కూడా ప్రయాణానికి 48 గంటలలోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే బహ్రెయిన్ చేరుకున్నాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. బహ్రెయిన్ చేరుకున్న వెంటనే తొలి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఆ తర్వాత ఐదో రోజున రెండో పీసీఆర్ టెస్ట్...పదో రోజున మూడో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







